పెర్త్: ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా ప్లేయర్ల గాయాలు కలవరపెడుతున్నాయి.
ఇప్పటికే కేఎల్ రాహుల్ గాయపడగా, తాజాగా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఎడమచేతి వేలుకు గాయమైంది. ఇంట్రా మ్యాచ్‌లో భాగంగా శనివారం ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ గాయపడ్డాడు. ఈనెల 22 నుంచి మొదలయ్యే తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండే అవకాశం లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.