ఇండోర్: భారత టెస్ట్, వన్డే సారథి శుభ్‌మన్ గిల్ రంజీ ట్రోఫీ రెండో దశ పోటీలకు సిద్ధమవుతున్నాడు. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్ అనంతరం అతడు విరామం తీసుకుంటాడని భావించినా.. భారత కెప్టెన్ మాత్రం రంజీలు ఆడేందుకు నిశ్చయించుకున్నాడు.
ఈనెల 22 నుంచి రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరుగబోయే మ్యాచ్‌లో అతడు ఆడనున్నట్టు పంజాబ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నమే గిల్.. ఇండోర్ నుంచి రాజ్‌కోట్‌కు పయనమయ్యాడు.