IPL 2025 : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్(53) మరోసారి చెలరేగాడు. జైపూర్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ అర్ధ శతకం సాధించాడు. హసరంగ ఓవర్లో సింగిల్ తీసిన గిల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని థీక్షణ విడదీశాడు. అతడి బౌలింగ్లో డేంజరస్ సాయి సుదర్శన్(39) ఔటయ్యాడు. సుదర్శన్ పెద్ద షాట్ ఆడబోగా.. రియాన్ పరాగ్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 93 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది. జోస్ బట్లర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 97-1.
ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు రాజస్థాన్పైనా చెలరేగారు. పవర్ ప్లేలో రియాన్ పరాగ్ బృందం ఎంత ప్రయత్నించినా శుభ్మన్ గిల్(53), సాయి సుదర్శన్(39)లు వికెట్ ఇవ్వలేదు. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిన వీళ్లు 6 ఓవర్లకు స్కోర్ 50 దాటించారు.