Shubman Gill : సుదీర్ఘ ఫార్మాట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సెంచరీలతో హోరెత్తించిన టీమిండియా సారథి.. అత్యధిక పరుగులతో అతడు అందరికంటే ముందున్నాడు. అలాగనీ వెయ్యికి పైగా రన్స్ కొట్టలేదు. అయినా కూడా అతడే 2025లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రగామిగా నిలిచాడు. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన శుభ్‌మన్ గిల్ నాయకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో దంచేసిన గిల్ ఆ తర్వాత వెస్టిండీస్‌పైనా చెలరేగాడు. మొత్తంగా 16 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదిన ఇండియన్ కెప్టెన్.. 70.21 సగటు, 983 పరుగులతో ఈ ఏడాదిని ముగించాడు. 2025లో టెస్టుల్లో అత్యధిక సగటు గిల్‌దే కావడం విశేషం. భారత్‌పై, ఆస్ట్రేలియాపై సెంచరీలతో రికార్డులు నెలకొల్పని జో రూట్ సగటు 57.70 మాత్రమే.
No-one crossed 1000 Test runs in 2025, but India captain Shubman Gill had a year to remember ✨ pic.twitter.com/OqtQ4C4hxB
— ESPNcricinfo (@ESPNcricinfo) December 29, 2025
యాషెస్ సిరీస్‌లో మెరుపు శతకాలతో ఇంగ్లండ్‌ను నట్టేట ముంచిన ట్రావిస్ హెడ్ 817 రన్స్‌తో రెండో ర్యాంక్ సాధించాడు. టీమిండియాకు ఆపద్భాందవుడైన కేఎల్ రాహుల్ 813 రన్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్లు జో రూట్ 805 పరుగులతో, హ్యారీ బ్రూక్ 771 పరుగులతో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. అయితే.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెడకు బంతి తగిలి సిరీస్ మొత్తానికి గిల్ దూరమయ్యాడు. లేదంటే అతడు కచ్చితంగా వెయ్యి పరుగులతో ఈ ఏడాదిని ముగించేవాడు.