Shubman Gill : టెస్టు, వన్డే సారథిగా పట్టాభిషేకం తర్వాత శుభ్‌మన్ గిల్ (Shubman Gill)కు గడ్డుకాలం మొదలైంది. ఇంగ్లండ్ పర్యటనలో సెంచరీలు మినహాయిస్తే వన్డే, టీ20ల్లో పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమికి బాధ్యుడవుతున్నాడు గిల్. ఇండోర్ వన్డేలోనైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడనుకంటే 23 పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. దాంతో.. మళ్లీ ఫామ్‌లోకి రావడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు గిల్. ఇటీవల నాయకుడిగా తేలిపోతున్న అతడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మెడ గాయంతో బ్రేక్ తీసుకున్న శుభ్‌మన్ గిల్.. పునరాగమనం తర్వాత నిరాశపరుస్తున్నాడు. న్యూజిలాండ్‌పై మూడు వన్డేల్లో అతడు ఒక్కటంటే ఒక్క అర్ధశతకం కాదుకదా జట్టును గెలిపించే పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ 23 పరుగులకే జేమీసన్ ఓవర్లో బౌల్డయ్యాడు. దాంతో, మరోసారి ‘ఇప్పుడే గిల్‌కు వన్డే కెప్టెన్సీ అవసరమా? కేఎల్ రాహుల్ ఉన్నాడుగా? ‘అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
🚨Shubman Gill playing For Punjab🚨
-He will play in the Ranji Trophy Match starting January 22. Against Saurashtra(Abhishek Tripathi) pic.twitter.com/ZZwWGgs7QA
— Cricupsdaily (@cricupsdaily) January 19, 2026
ఈ నేపథ్యంలో ఫామ్‌తో మళ్లీ మునపటి గిల్‌ను తలపించాలని అతడు.. కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత కెప్టెన్ ఇండోర్ నుంచి సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి రాజ్‌కోట్ వెళ్లనున్నాడు. అక్కడ జనవరి 22న స్వరాష్ట్రతో మ్యాచ్‌లో పంజాబ్ తరఫున గిల్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ క్రికెట్ సంఘం ధ్రువీకరించింది.
Kyle Jamieson cleans up Indian skipper Shubman Gill with a ripper! 🇳🇿🔥
After a good start, Gill throws away his wicket for 23 (18). 🤯
🇮🇳 – 45/2 (6.4)#INDvNZ #ODIs #Indore #Sportskeeda pic.twitter.com/fWwflW0PRL
— Sportskeeda (@Sportskeeda) January 18, 2026
‘రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్ ఆడడపై స్పష్టత వచ్చింది. సౌరాష్ట్ర మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడడం కోసం భారత కెప్టెన్ 8 గంటలు విమాన ప్రయాణం చేయనున్నాడు. అంకితభావమంటే అది’ అని పీసీఏ తెలిపింది. రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టు ఎలైట్ గ్రూప్ బీలో ఉంది.