Shubman Gill : అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో తొలి మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ మార్క్ అందుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ సెంచరీ సాధించాడు. స్వదేశంలో అతనికి మూడో శతకం. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు కొట్టిన రెండో భారత ఆటగాడిగా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను 17 ఇన్నింగ్స్‌ల్లోనే 3 శతకాలు బాదాడు.
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ రెండు సెంచరీలతో చెలరేగాడు. తొలి వన్డేలో, మూడో వన్డేలో వంద కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పోయిన ఏడాది వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగించిన అతను ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకుంటున్నాడు. ఓపెనర్ స్థానానికి ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ నుంచి పోటీ ఉండడంతో ఈ యంగ్‌స్టర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ స్వదేశంలో జరగనుంది. వరుస సెంచరీలు సాధిస్తున్న గిల్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం అంటున్నారు మాజీ క్రికెటర్లు.