IPL 2025 : భీకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (50), సాయి సుదర్శన్(50)లు అర్ధ శతకం బాదేశారు. పవర్ ప్లే తర్వాత దూకుడు పెంచిన గిల్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఓవర్లో సిక్సర్ కొట్టిన సాయి ఫిఫ్టీకి చేరువయ్యాడు. . 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదిన గుజరాత్ సారథికి ఈ సీజన్లో ఇది మూడో ఫిఫ్టీ. వీళ్లిద్దరి మెరుపులతో గుజరాత్ స్కోర్ 100 దాటేసింది. 11 ఓవర్లకు గుజరాత్ స్కోర్..104.
ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్(50), శుభ్‌మన్ గిల్(50) దంచి కొడుతున్నారు. పవర్ ప్లే తర్వాత గేర్ మార్చిన గిల్ మోయిన్ అలీకి చుక్కలు చూపించాడు. 6, 4, 4 బాది 17 రన్స్ పిండుకున్నాడు. దాంతో, గుజరాత్ నెట్రన్ రేటు 9కి చేరింది. కచ్చితమైన షాట్లతో అలరిస్తున్న ఈ జోడీని విడదీసేందుకు కోల్‌కతా బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు.