IND vs ENG 5th Test : ధర్మశాల టెస్టులో టీమిండియా(Team India) విజయానికి మరింత చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్, బుమ్రా చెలరేగడంతో ఇంగ్లండ్(England) ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. సెంచరీ వీరుడు శుభ్‌మన్ గిల్, వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్‌స్టోలు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారు.
వాళ్ల సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అసలు ఏం జరిగిందంటే..? 36 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో బెయిర్‌స్టో క్రీజులోకి వచ్చాడు. భారీ షాట్లతో అశ్విన్ లయను దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే.. అతడు ఆటపై దృష్టి పెట్టకుండా రెండో రోజు ‘అండర్సన్ గురించి ఏం అన్నావు?’ అని గిల్‌తో మాటల యుద్ధాని(Sledging)కి దిగాడు.
🫶🏻🫶🏻 pic.twitter.com/uBq4DueaYX
— zahana🕷️ (@77ftw_) March 9, 2024
అందుకు గిల్’నేను అతడితో నువ్వు రిటైర్ అవ్వాలని చెప్పాను’ అని బదులిచ్చాడు. ‘అవునా.. ఆ తర్వాతి బంతికే జిమ్మీ నిన్ను ఔట్ చేశాడుగా’ అని బెయిర్‌స్టో అనగా.. అందుకు భారత స్టార్ ‘నేను సెంచరీ కొట్టిన తర్వాత ఔట్ చేశాడు’ అని అతడికి కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ‘ఈ సిరీస్‌లో నువ్వు ఎన్ని సెంచరీలు కొట్టావు?’ అని గిల్ ప్రశ్నించాడు.
దాంతో చిర్రెత్తుకొచ్చిన బెయిర్‌స్టో.. ‘ఎన్ని సెంచరీలు కొట్టానా.. ఇక ఆపెయ్’ అంటూ ఉడికిపోయాడు. దాంతో, సర్ఫరాజ్ ఖాన్ కలుగజేసుకొని ‘గమ్మునుండవయ్యా’ అని బెయిర్‌స్టోను స్లెడ్జింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కష్ట సమయంలో నిలబడాల్సిన బెయిర్‌స్టో 31 బంతుల్లో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన అతడు 238 రన్స్ చేశాడంతే. మరోవైపు గిల్.. 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలతో 452 పరుగులు సాధించాడు.