బెంగుళూరు: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shresta Iyer)పై ఆన్లైన్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో శ్రేయాస్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. దీంతో అతన్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. కోహ్లీ ఫ్యాన్స్ శ్రేయాస్‌పై కామెంట్స్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీఐ పంజాబ్ నెగ్గింది, కానీ ఏప్రిల్ 20వ తేదీన జరిగిన మ్యాచ్‌లో మాత్రం అయ్యర్ జట్టు ఓటమి పాలైంది.
శ్రేయాస్‌ను టార్గెట్ చేయడాన్ని అతని సోదర శ్రేష్టా అయ్యర్ తప్పుపట్టారు. ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో రియాక్ట్ అయ్యారు. కుటుంబాన్ని నిందించడం నిరుత్సాహపరుస్తుందని ఆమె పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్నా.. దూరంగా ఉన్నా.. తమ మద్దతు జట్టుకు ఉంటుందన్నారు. తనపై వేలి ఎత్తి చూపడం అంటే అది మీ మైండ్‌సెట్‌ను ప్రజెంట్ చేస్తుందన్నారు. లెక్కలేనన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశానని, ఎన్నో మ్యాచుల్లో జట్టు విజయం సాధించిందని, కనబడకుండా ట్రోలింగ్ చేయడం అంటే వాస్తవాలను గ్రహించలేకపోవడమే అని శ్రేష్టా తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పింది.
Shreyas Iyer’s sister, Shresta Iyer, shared an Instagram story about being abused by Virat Kohli fans. Shubman Gill’s sister, Rohit Sharma’s daughter, and KL Rahul’s wife were also abused by Virat Kohli fans, Shreyas Iyer’s sister has now faced the same. Shameful stuffs pic.twitter.com/8kLtk7hTcA
— 👑 (@SG77Era) April 20, 2025