Shreyas Iyer | టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఇండియా ‘డీ’ జట్టుకు
ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్ టైమ్ బాగోలేనట్టుంది. గతేడాది అతడి వ్యవహార శైలి కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురవడంతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. దులీప్ ట్రోఫీలో రాణించి మళ్లీ టెస్టు జట్టులోకి రావాలని ఆశిస్తున్నా టైమ్ మాత్రం అందుకు అనుకూలించడం లేదు. దీనికి తోడు శ్రేయస్ అటిట్యూట్ మరోసారి చర్చనీయాంశమైంది. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన అతడు.. సన్ గ్లాసెస్‌తో క్రీజులోకి రావడం.. వచ్చిన రెండు నిమిషాలకే డకౌట్ అవడంతో నెట్టింట అతడు తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నాడు.
దులీప్ ట్రోఫీ రెండో దశ పోటీలలో భాగంగా అనంతపూర్ వేదికగా ఇండియా ‘ఏ’తో జరుగుతున్న రెండో మ్యాచ్ రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్.. స్టైల్‌గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని క్రీజులోకి వచ్చాడు. సాధారణంగా క్రికెట్లో ఫీల్డర్లు.. సూర్యరశ్మి నుంచి ఉపశమనంతో పాటు దుమ్ము దూళి వంటివి కంట్లో పడకుండా ఉండేందుకు కూలింగ్ గ్లాసెస్‌ను ధరిస్తారు. పలు సందర్భాల్లో స్పిన్ బౌలర్లు సైతం బౌలింగ్ చేసేప్పుడు వీటిని పెట్టుకుంటారు. కానీ బ్యాటర్లు మాత్రం సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేయడం అరుదు. ఈ మధ్యకాలంలో అయితే అలా జరిగిన సందర్భాలూ లేవు. కానీ శ్రేయస్ మాత్రం శుక్రవారం సన్ గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయడం గమనార్హం.
Batting with sunglasses after getting dropped from team, He is not taking cricket seriously!!
guy thinks he is Brian Lara (Lara also removed glasses after few balls)#DuleepTrophy#INDvsBAN #CricketTwitter #ShreyasIyer pic.twitter.com/WV8q8pbtDo
— Abhinav Singh (@27_abhinav) September 13, 2024
Shreyas Iyer’s sunglasses were the coolest thing about his innings… because it ended with a duck! #ShreyasIyer #DuleepTrophy pic.twitter.com/L2hVm47xqa
— Gajan (@JayHind108) September 13, 2024
అంత స్టైలిష్‌గా బ్యాటింగ్‌కు వచ్చినా శ్రేయస్ ఏమైనా భారీ స్కోరు చేశాడా? అంటే అదీ లేదు. ఏడు బంతులను ఎదుర్కున్న అతడు.. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్లో అకిబ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో శ్రేయస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆడేది తక్కువ. అటిట్యూడ్ ఎక్కువ’, ‘ఇలా ఆడితే నువ్వు జాతీయ జట్టులోకి కాదు కదా.. కనీసం దేశవాళీలు కూడా ఆడలేవు’ అంటూ చురకలంటిస్తున్నారు. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో కూడా శ్రేయస్ స్థాయికి మేర రాణించకపోవడంతో బంగ్లాతో తొలి టెస్టులో అతడికి చోటు దక్కలేదు. తాజా ప్రదర్శనతో సెలక్టర్లు అతడిని రెండో టెస్టులోనూ పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.