Punjab Floods : ఇటీవల సంభంవించిన వరదలతో పంజాబ్ రాష్ట్రం విలవిలలాడింది. ప్రకృతి ప్రకోపానికి బలైన పంజాబ్ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు విరాళాలు ఇస్తున్నారు సినీ, క్రీడా ప్రముఖులు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ మధ్యే రూ.5 కోట్లు ప్రకటించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) సైతం విరాళాలు ఇవ్వండి అని కోరుతున్నాడు. ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడీ భారత స్టా్ర్ ప్లేయర్.
‘పంజాబ్ రాష్ట్రం గుర్తింపు అయిన బలం, ధైర్యం మనకు తెలిసినవే. పంజాబ్ ప్రజల నుంచి లభించిన ప్రేమ నాకు కొండంత బలం. కానీ, ఈరోజు వరదలు మనల్ని కుంగదీశాయి. అయితే.. ఈ విపత్కర పరిస్థితిని మనమంతా కలిసి అధిగమించగలం. మీరు అందించే చిన్న ఆర్ధిక సాయమైనా సరే ఒకరి జీవితంలో కొత్త ఆశలు చిగురింపజేస్తుంది.
𝐏𝐮𝐧𝐣𝐚𝐛 𝐤𝐢 𝐡𝐢𝐦𝐦𝐚𝐭 𝐚𝐮𝐫 𝐡𝐚𝐮𝐬𝐥𝐚 𝐮𝐬𝐤𝐢 𝐩𝐞𝐡𝐜𝐡𝐚𝐧 𝐡𝐚𝐢𝐧! 💪
Join Punjab Kings and Global Sikh Charity as we raise funds for those impacted by the floods!
Head to the 🔗 in our bio and make your contributions now.#TogetherForPunjab #PunjabKings pic.twitter.com/Z2ZsUZptKQ
— Punjab Kings (@PunjabKingsIPL) September 6, 2025
మనమంతా చేయూతనిస్తే పంజాబ్ ప్రజల ముఖాల్లో మళ్లీ నవ్వులు తీసుకురాగలం. వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ కోసం మనందరం ఒక్కటవుదాం. చేతనైనంతా విరాళం ఇద్దాం. ఈ కష్టకాలంలో మీ సాయం ఎంతో విలువైనది’ అని పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియోలో దాతలు ముందుకు రావాలని అయ్యర్ కోరాడు. కరోనా సమయంలో వేలాది మందికి సాయం చేసిన బాలీవుడ్ హీరో సోనూ సూద్ పంజాబ్ వరద బాధితులకు కూడా ఆపన్నహస్తం అందించాడు.
వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల పునరావాసం కోసం పంజాబ్ కింగ్స్ రూ.33.8 లక్షలు విరాళం ప్రకటించింది. అంతేకాదు గ్లోబల్ సిఖ్ ఛారిటీ సంస్థతో కలిసి విరాళాలు సేకరిస్తోంది. దాతల నుంచి కనీసం రూ.2 కోట్లు సేకరించి బాధితులకు అందించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది.
We’ve reached some flood-affected areas in Punjab and are working to reach the rest. This is not just help — it’s our promise to stand with you, always. 💛#PunjabFloods #FloodRelief #WeStandWithPunjab #TogetherForPunjab@SoodFoundation @Malvikasood4 pic.twitter.com/VtRvDmVm1e
— sonu sood (@SonuSood) September 3, 2025
హిమాలయ నదులైన సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగడంతో పంజాబ్లో వరద విలయం సృష్టించింది. ఫలితంగా ఈ దశాబ్దంలో కనీవినీ ఎరుగని విధంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసింది పంజాబ్. ఉత్తరాదిన ఊహించని వరద కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి 23 జిల్లాలు, 1,902 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని.. 3.84 లక్షలకు పైగా మందిపై ప్రభావం పడిందని ముఖ్యమంత్రి హర్దీప్ సింగ్ ముందియాన్ వెల్లడించారు.