Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు
Shreyas Iyer : మార్చి 2025 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇండియన్ స్టయిలిష్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గెలుచుకున్నాడు. మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అతను మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
ముంబై: మార్చి 2025 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇండియన్ స్టయిలిష్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర నుంచి పోటీ వచ్చినా.. ఆ రేసులో అయ్యర్ టాప్‌లో నిలిచాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ బ్యాటర్ అత్యధికంగా 243 రన్స్ స్కోర్ చేశాడు. భారత జట్టు గెలుపుతో అతను కీలక పాత్ర పోషించాడు. అయితే వరుసగా ఇద్దరు ఇండియన్లకు ఈ అవార్డు దక్కింది. ఫిబ్రవరి నెలలో శుభమన్ గిల్ .. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వశం చేసుకున్నాడు.
మిడల్ ఆర్డర్లో అయ్యర్ ఇటీవల కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అద్భుతమైన స్ట్రోక్ ప్లే ప్రదర్శించాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టు ట్రోఫీ గెలవడంతో కీలకంగా వ్యవహించాడు. మార్చి నెలకు ఐసీసీ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని అయ్యర్ తెలిపాడు. ఈ గౌరవం తనకు ఎంతో ప్రత్యేకమైందన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నెలలోనే ఆ అవార్డు రావడంతో నిజంగా ఆ జ్ఞాపకాలను మరిచిపోలేమన్నారు.
మార్చిలో ఆడిన మూడు వన్డేల్లో అతను 57 సగటుతో 172 రన్స్ చేశాడు. గ్రూపు ఏ మ్యాచ్‌లో కివీస్‌పై 79 రన్స్, ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 45 రన్స్, ఇక ఫైనల్లో 48 రన్స్ చేశాడు.
Stylish batter wins the ICC Men’s Player of the Month for March for his Champions Trophy heroics 👏https://t.co/7Hp7yaqS6T
— ICC (@ICC) April 15, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

