ముంబై: భారత క్రికెట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్ (164 బంతుల్లో 152 నాటౌట్, 18 ఫోర్లు, 4 సిక్సర్లు) రంజీ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే శతకంతో సత్తా చాటాడు. ముంబై వేదికగా ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రేయస్..
ఆది నుంచే వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి సిద్ధేశ్ (116 నాటౌట్) జతకలవడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా కదులుతోంది.