బెట్టింగ్ ఉచ్చు తప్పించుకోవచ్చు
బెట్టింగ్ కంపెనీలు మానవ మెదడు బలహీనత, సైకాలజీని బేస్ చేసుకుని యాప్స్‌ను రూపొందిస్తాయి. బెట్టింగ్‌లో నిర్వాహకులే తప్పఆడేవారు ఎప్పటికీ గెలవరని అర్థం చేసుకుంటేనే ఈ అడిక్షన్ నుంచి బయటపడటం సాధ్యమవుతుంది.
బెట్టింగ్ కంపెనీలు మానవ మెదడు బలహీనత, సైకాలజీని బేస్ చేసుకుని యాప్స్‌ను రూపొందిస్తాయి. బెట్టింగ్‌లో నిర్వాహకులే తప్పఆడేవారు ఎప్పటికీ గెలవరని అర్థం చేసుకుంటేనే ఈ అడిక్షన్ నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. ఇదేం బ్రహ్మవిద్య కాదు. కాస్త మానసికంగా దృఢంగా ఉంటే చాలు.. బెట్టింగ్ ఉచ్చును తప్పించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
1. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్
బెట్టింగ్ అడిక్షన్ ఉన్నవారి మెదడులో కొన్ని అహేతుకమైన నమ్మకాలు స్థిరపడిపోతాయి. వాటిని గుర్తించి మార్చడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం. ‘పోయిన డబ్బును బెట్టింగ్ ద్వారానే తిరిగి సంపాదించగలను‘ అనే భ్రమను మెదడు నుంచి తొలగించాలి. ‘నేను ఎంత ఆడితే అంత నష్టపోతాను’ అనే వాస్తవాన్ని ప్రతిసారీ గుర్తుచేసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ లేదా సైట్లు అన్నీ నిర్వాహకులే ఎప్పుడూ గెలుస్తారు అనే మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయనే నిజాన్ని గట్టిగా నమ్మాలి.
2. ‘స్టిమ్యులస్ కంట్రోల్’, ’అర్జ్ సర్ఫింగ్’
బెట్టింగ్ వేయాలనే కోరిక వచ్చినప్పుడు దానిని ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం. మిమ్మల్ని బెట్టింగ్ వైపు లాగే ప్రతి వస్తువును దూరం పెట్టండి. ఫోన్ నుంచి అన్ని బెట్టింగ్ యాప్స్ డిలీట్ చేయడం, స్కోర్ చూసే వెబ్సైట్లను బ్లాక్ చేయడం, బెట్టింగ్ ఆడే స్నేహితులకు దూరంగా ఉండటం ఇందులో భాగం. బెట్టింగ్ వేయాలనే కోరిక సముద్రపు అల లాంటిది. అది ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచి, కాసేపటికి చల్లారుతుంది. ఆ కోరిక వచ్చినప్పుడు దానికి లొంగిపోకుండా, ఒక 15 నుంచి 20 నిమిషాలు వేచి ఉండాలి. ఈ గ్యాప్‌లో వేరే పనిలోకి నడవడం, పాటలు వినడం, ఎవరితోనైనా మాట్లాడటం వంటి వాటి పై మనసును మళ్లించాలి.
3. ఆర్థిక నియంత్రణను ఇతరులకు అప్పగించడం..
చేతిలో డబ్బు, నియంత్రణ ఉన్నప్పుడే మెదడు బెట్టింగ్ వైపు లాగుతుంది. ఆ అవకాశాన్ని చట్టబద్ధంగా మూసివేయాలి. బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ పిన్ నంబర్లను మీ కుటుంబంలో నమ్మకస్తుడైన వ్యక్తికి అప్పగించండి. రోజువారీ ఖర్చులకు ఎంత అవసరమో అంత డబ్బు మాత్రమే మీ దగ్గర ఉంచుకోండి. చేతిలో లూజ్ మనీ లేకపోవడం వల్ల బెట్టింగ్ వేయాలనే ఆలోచన వచ్చినా ఆచరణలో పెట్టలేరు.
4. డోపమైన్ రీప్లేస్మెంట్
బెట్టింగ్ ఆడేటప్పుడు మెదడులో విపరీతంగా విడుదలయ్యే డోపమైన్ (కిక్) కారణంగానే దానికి అడిక్ట్ అవుతారు. బెట్టింగ్ మానేసిన కొత్తలో మెదడు శూన్యంగా, బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఆ స్థానాన్ని మంచి అలవాట్లతో భర్తీ చేయాలి. జిమ్‌కి వెళ్లడం, రన్నింగ్ చేయడం లేదా క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి శారీరక క్రీడలు ఆడటం వల్ల మెదడుకు సహజమైన రీతిలో డోపమైన్ అందుతుంది. మైండ్ వేరే వైపు మళ్లడానికి కొత్త కోర్సులు నేర్చుకోవడం లేదా వ్యాపార ఆలోచనలపై దృష్టి పెట్టాలి.
5. ప్రొఫెషనల్ హెల్ప్
సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. అప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. థెరపిస్ట్‌లు మీ ప్రవర్తనను, వ్యసనానికి దారితీసే మానసిక బలహీనతలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో శిక్షణ ఇస్తారు. ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఆందోళన తగ్గి, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కంట్రోల్ అవుతాయి.
ఇది ట్రై చేయండి..
బెట్టింగ్ వ్యసనం నుంచి బయటపడటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో ఒక అద్భుతమైన, సులువైన వ్యాయామం ఉంది. దీనిని ‘ఆలోచనల రికార్డు’ లేదా ‘ట్రిగ్గర్ విశ్లేషణ’ అంటారు. బెట్టింగ్ ఆడాలనే తీవ్రమైన కోరిక మనసులోకి వచ్చినప్పుడు మీ ఆలోచనలను మార్చుకోవడానికి ఈ వ్యాయామం చాలా బాగా పనిచేస్తుంది. బెట్టింగ్ వేయాలనిపించినప్పుడు వెంటనే ఆ పని చేయకుండా, ఒక డైరీ లేదా ఫోన్ నోట్స్‌లో ఈ కింది 4 స్టెప్స్ రాసుకోండి.
1.ట్రిగ్గర్ (పరిస్థితిని గుర్తించడం)
ప్రశ్న: బెట్టింగ్ ఆడాలనే కోరిక ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఉన్నప్పుడు వచ్చింది?
ఉదాహరణ: ‘ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, చేతిలో ఫోన్ ఉంది, ఒక మ్యాచ్ లైవ్ వస్తోంది.’
2. ఆటోమేటిక్ ఆలోచన ( మనసులో వచ్చే భ్రమ)
ప్రశ్న: ఆ సమయంలో మీ మనసు మిమ్మల్ని ఎలా లోబరుచుకోవాలని చూస్తున్నది?
ఉదాహరణ: ‘ఈ ఒక్కసారి బెట్టింగ్ వేస్తే పోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఈసారి కచ్చితంగా గెలుస్తాను.’
3. వాస్తవ విశ్లేషణ ( నిజాన్ని గుర్తుచేసుకోవడం)
ప్రశ్న: మీ గత అనుభవాల ప్రకారం నిజం ఏంటి? గతంలో ఇలా చేసినప్పుడు ఏం జరిగింది?
ఉదాహరణ: ‘గతంలో కూడా ఇలాగే అనుకుని చాలాసార్లు డబ్బులు పోగొట్టుకున్నాను.’
4. ఫలితం.. ప్రత్యామ్నాయ పని
ప్రశ్న: ఇప్పుడు మీ కోరిక ఎంతవరకు తగ్గింది? ఆ కోరిక నుంచి మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఇప్పుడు మీరు చేయబోయే వేరే పని ఏంటి?
ఉదాహరణ: ‘నిజం ఆలోచించాక బెట్టింగ్ వేయాలనే కోరిక కొద్దిగా తగ్గింది. ఇప్పుడు నేను నా ఫోన్ పక్కన పెట్టి, 15 నిమిషాలు బయటికి వెళ్లి నడిచి వస్తాను లేదా నా స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతాను.’మీ మనసు బెట్టింగ్ కోసం లాగుతున్నప్పుడు, ‘నేను కేవలం 15 నిమిషాలు ఆగుతాను’ అని మీకు మీరు చెప్పుకోండి. ఈ 15 నిమిషాల్లో పైన చెప్పిన CBT వ్యాయామం రాయండి. కోరిక మెల్లగా సమసిపోతుంది.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

