Shreyas Iyer : టీమిండియా మ్యాచ్ విన్నర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వచ్చేస్తున్నాడు. సిడ్నీ వన్డేలో గాయంతో రెండు నెలలకుపైగా ఆటకు దూరమైన అయ్యర్.. పునరాగమనం కోసం సిద్దమవుతున్నాడు. స్వదేశంలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ స్క్వాడ్‌లో ఈ స్టార్ క్రికెటర్ ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో అయ్యర్ ఆడుతాడని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్న అతడు బ్యాటింగ్ సెషన్లో పాల్గొన్నాడు. గురువారం అయ్యర్ సాధన చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
వన్డేల్లో కీలకమైన ఆటగాడిగా ఎదిగిన శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేసేందుకు రెఢీగా ఉన్నాడు. సర్జరీ అనంతరం వేగంగా కోలుకున్న భారత స్టార్.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిపుణుల పర్యవేక్షణలో ఫిట్నెస్ పరీక్షలకు హాజరవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలకు దూరమైన అతడు.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. సీఓఈ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సెలెక్టర్లు అయ్యర్ పేరును పరిశీలిస్తారు. కొత్త ఏడాది ఆరంభంలో కివీస్ టీమ్ వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత్‌కు రానుంది. జనవరి 11న వడోదరలో తొలి వన్డేతో వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.
There are high chances that Shreyas Iyer will make his comeback in the NZ series.
but “saarr he’s doubtful for IPL” 😹😹pic.twitter.com/7fJaFewnjn
— Dhillon (@sehajdhillon_) December 25, 2025
🚨| Shreyas Iyer’s return to cricket will be confirmed in the next few days at the CoE. 🤞 pic.twitter.com/SLTONZBFkp
— Pick-up Shot (@96ShreyasIyer) December 25, 2025
వన్డేల్లో నాలుగో స్థానంలో స్థిరపడిన అయ్యర్ రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్‌లో, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు జట్టుతో వెళ్లిన అయ్యర్ మూడో మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడ్డాడు. హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడు.
🚨 REPORTS 🚨
Shreyas Iyer is likely to be available for the later stages of the Vijay Hazare Trophy 2025–26. 🏆
The New Zealand ODI series will be touch and go for the Indian vice-captain. 🇮🇳
Source: TOI#Cricket #Iyer #India pic.twitter.com/kXhbAgYUpX
— Sportskeeda (@Sportskeeda) December 25, 2025
స్కానింగ్ పరీక్షల్లో ప్లీహం దెబ్బతిన్న విషయం బయటపడగా.. సిడ్నీలోనే ఆపరేషన్ చేయించున్న అయ్యర్.. అక్కడే కొన్నిరోజులు ఉండి కాంచెం కోలుకున్నాక స్వదేశం తిరిగొచ్చాడు. ఇంటివద్ద అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకున్న భారత స్టార్ ఆరోగ్యాన్ని స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పర్దివాలీ పరీశీలించి.. అతడు వేగంగా కోలుకుంటున్నాడని చెప్పాడు.
Return of IYER 🚨
After a setback from injury Shreyas Iyer will be back in later stages of Vijay Hazare Trophy.#Cricket #VijayHazareTrophy pic.twitter.com/0BVdtxFblC
— CREX (@Crex_live) December 25, 2025
ఐపీఎల్లో ‘నాకౌట్ కెప్టెన్’గా ముద్ర పడిన అయ్యర్..18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఫైనల్ చేర్చాడు. కానీ, ఆ జట్టు తొలి కప్ కలను మాత్రం సాకారం చేయలేకపోయాడు. నిరుడు చేజారిన ట్రోఫీని ఈసారి ఫ్రాంచైజీకి అందించాలనే పట్టుదలతో ఉన్నాడీ సర్పంచ్ సాబ్.