IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) రెండో విజయం సాధించింది. తొలిపోరులో గుజరాత్ టైటన్స్‌కు షాకిచ్చిన పంజాబ్.. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(69), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(52 నాటౌట్ : 34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇంప్యాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా(43 నాటౌట్ : 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధనాధన్ ఆడారు. వీరిద్దరి మెరుపులతో లక్నోపై 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది పంజాబ్.16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఏకపక్ష పోరులో లక్నోపై 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసి నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది పంజాబ్.
ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సేన ఘన విజయం సొంతం చేసుకుంది. ఆల్‌రౌండ్ షోతో లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 172 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య(8) త్వరగానే వెనుదిరిగినా.. ప్రభ్సిమ్రాన్ సింగ్(69) మరింత ధాటిగా ఆడాడు. పవర్ ప్లేలో 62-1తో పటిష్ట స్థితిలో నిలిచిన పంజాబ్ ఇన్నింగ్స్ మరింత వేగంగా సాగింది. అర్థ శతకం తర్వాత ప్రభ్సిమ్రాన్ మరింత ధాటిగా ఆడాడు.
The 6⃣🔥
The Catch 🤌Both approved by Ricky Ponting 😌
Updates ▶ https://t.co/j3IRkQFrAa #TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/XSuat7Wy1H
— IndianPremierLeague (@IPL) April 1, 2025
ప్రభ్‌సిమ్రన్ 110 వద్ద ఔటయ్యాక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు జత కలిసిన ఇంప్యాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి లక్ష్యాన్ని మంచుముక్కలా కరిగించాడు. బిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ నేహల్ వధేరా 6,4, 6 తో 16 రన్స్ పిండుకున్నాడు. అవేశ్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో గేర్ మార్చిన శ్రేయాస్ 4, 6 బాదాడు. శార్థూల్ ఠాకూర్‌కు చుక్కలు చూపిస్తూ నేహల్ వరుసగా రెండుసార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపి జట్టు స్కోర్ 160 దాటించాడు. ఐదో బంతిని బౌండరీకి పంపగా స్కోర్ సమం అయింది. మరుసటి ఓవర్లో అయ్యర్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించి.. జట్టుకు 8 వికెట్ల విజయాన్ని అందించాడు.
హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(3-43) విజృంభణతో ఆది నుంచి తడబడుతూ సాగింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును నికోలస్ పూరన్(44), ఆయుష్ బదొని(41)లు ఆదుకున్నారు. పంజాబ్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ లక్నో స్కోర్‌బోర్డును ఉరికించారు. అర్థ సెంచరీకి ముందు పూరన్ ఔటైనా.. అబ్దుల్ సమద్(27)తో కలిసి బదొని సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, పంత్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగలిగింది.
Innings Break!#PBKS got off to a strong start ☝
But #LSG fought back with some firepower 🔥
Who will bag the 2⃣ points? 🤔
Updates ▶ https://t.co/j3IRkQFrAa #TATAIPL | #LSGvPBKS | @LucknowIPL | @PunjabKingsIPL pic.twitter.com/RnM23KBBFv
— IndianPremierLeague (@IPL) April 1, 2025