బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం ప్రపంచంలోని బెస్ట్ పేస్ బౌలర్లలో ఒకడిగా ఉన్న ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఆడటానికి ఈ సిరీస్ మొదటి నుంచీ మన బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. అలాంటిది టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం అతని బౌలింగ్‌లోనే ఓ అరుదైన ఘనత సాధించాడు. అతడు క్రీజులోకి వచ్చీ రాగానే కమిన్స్ వేసిన మూడో బంతినే సిక్స్ కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో అతను సాధించిన తొలి పరుగులు ఇవే. ఇలా సిక్స్‌తో టెస్ట్ క్రికెట్లో ఖాతా తెరిచిన రెండో ఇండియన్ బ్యాట్స్‌మన్ శార్దూల్ ఠాకూర్. గతంలో రిషబ్ పంత్ కూడా ఇలాగే సిక్స్‌తోనే తన పరుగుల ఖాతా తెరిచాడు. ఆ ఒక్క షాటే కాదు.. తర్వాత కూడా ఆసీస్ బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ అద్భుతమైన షాట్లతో టీమిండియాను గట్టెక్కించే పనిలో ఉన్నాడు శార్దూల్. తొలి టెస్ట్ ఆడుతున్న వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నాడు. శార్దూల్ కొట్టిన ఈ సిక్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. రకరకాల మేమ్స్‌తో శార్దూల్ సిక్స్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
shardul thakur after hitting cummins for two classic boundaries #INDvsAUS pic.twitter.com/h88oHR0gwx
— Neeche Se Topper (@NeecheSeTopper) January 17, 2021
#AUSvsIND
— princeakshunverma07 (@AkshunVerma1) January 17, 2021
*Australian team - shardul ka out karna padega
After hitting one six & four
*Shardul thakur - pic.twitter.com/BWFq4DXBSI
After Seeing The Batting Of Washington Sundar And Shardul Thakur..
— Jethalal (@Jethiya_lal) January 17, 2021
Australia Team Rn - pic.twitter.com/cAUSePCm2H
తాజావార్తలు
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి