హైదరాబాద్, ఆట ప్రతినిధి: మేడ్చల్-మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నీలో శ్రావ్య విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల అండర్-11 ఫైనల్లో శ్రావ్య టైటిల్ సొంతం చేసుకోగా, అండర్-13లో ఆరాధ్య, మనస్వీ చాంపియన్‌షిప్ దక్కించుకున్నారు.
బాలుర అండర్-13 డబుల్స్‌లో విదిత్రెడ్డి, రవికిషోర్ జోడీ 21-14, 21-15తో కార్తీకేయ, శివాంశు ద్వయంపై గెలిచారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి జాతీయ మాజీ చీఫ్ కోచ్ భాస్కర్ బాబు అతిథిగా హాజరయ్యారు.