Shoiab Akhtar: కోహ్లీ 110 సెంచరీలు కొడుతాడు: షోయెబ్ అక్తర్
Shoiab Akhtar: అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 110 సెంచరీలు కొట్టడం ఖాయమని పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్ తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు చెప్పాడు.
ఇస్లామాబాద్: విరాట్ కోహ్లీ(Virat Kohli) మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో అతను సెంచరీతో తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 186 రన్స్ చేశాడు. అయితే 1205 రోజుల తర్వాత టెస్టుల్లో అతను సెంచరీ కొట్టాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అతను భారీ ఇన్నింగ్స్ ఆడాడు. తన చివరి సెంచరీకి.. 28వ టెస్టు సెంచరీకి అతను 41 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. ఆ సెంచరీతో అంతర్జాతీయ మ్యాచుల్లో కోహ్లీ సెంచరీల(Centuries) సంఖ్య 75కు చేరుకున్నది. అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్లలో సచిన్(Sachin) తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ ఇక మళ్లీ సెంచరీల మోత మోగిస్తాడని పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్(Shoiab Akhtar) అంచనా వేశాడు. ఓ బీస్ట్‌లా పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తాడని, కోహ్లీ కచ్చితంగా వంద సెంచరీల మార్క్‌ను దాటేస్తాడని షోయెబ్ పేర్కొన్నాడు. కోహ్లీ ఫామ్‌లోకి రావడం తనకు ఆశ్చర్యం ఏమీ లేదని, కానీ అతనిపై ఉన్న కెప్టెన్సీ ప్రజర్(Captaincy Pressure) తగ్గిందన్నాడు. ఇప్పుడు అతను మెంటల్‌గా ఫ్రీగా ఉన్నాడని అక్తర్ తెలిపాడు. ఇప్పుడు అతను ఎంతో ఫోకస్‌తో ఇన్నింగ్స్ ఆడుతాడని, కోహ్లీ మొత్తం 110 సెంచరీలు కొట్టగలడన్న నమ్మకం తనకు ఉందని అక్తర్ అన్నాడు.
రావల్పిండి ఎక్స్‌ప్రెస్(Rawalpindi Express)గా పేరుగాంచిన షోయెబ్ అక్తర్.. తన ఇంటర్నేషనల్ కెరీర్ రోజుల్లో సచిన్ టెండూల్కర్‌ను ఫేవరేట్ వికెట్‌గా భావించేవాడినని చెప్పాడు. ఓ సారి కోల్‌కతాలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు జరిగిన విషయాన్ని అతను చెప్పుకొచ్చాడు. సచిన్ వికెట్ తీసుకుంటానని తన టీమ్స్‌కు చెప్పినట్లు గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి బంతికే సచిన్ వికెట్ తీసినట్లు అతను చెప్పాడు. లక్ష మంది ప్రేక్షకుల మధ్య సచిన్ వికెట్ తీయడం సంతోషాన్ని ఇచ్చిందని, సచిన్ ఔటయ్యాక సగం స్టేడియం ఖాళీ అయ్యిందని షోయెబ్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

