BANW vs ENGW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ విఫలం కాగా.. శోభన మొస్త్రే(60) అర్ధ శతకంతో రాణించింది. ఇంగ్లిష్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న ఆమె విలువైన భాగస్వామ్యం నెలకొల్పగా.. ఆఖర్లో రబెయా ఖాన్(43) మెరుపులతో బంగ్లా కోలుకుంది.
స్మిత్ వేసిన చివరి ఓవర్లో రబెయా సిక్స్, ఫోర్ బాది హాప్ సెంచరీకి చేరువైంది. కానీ, షజిందా అక్తర్ ఔట్ కావడంతో 178కే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై పది వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్‌కు బంగ్లా బౌలర్లు చెక్ పెడుతారా? లేదా? అనేది ఆసక్తికరం. ఒకవేళ అది సాధ్యంకాకుంటే సీవర్ బ్రంట్ బృందానికి విజయం నల్లేరుమీద నడకే.
What a stage to bring up your maiden international fifty! 👏
With wickets falling at the other end, Shobhana Mostary stands tall & keeps the ship sailing for Bangladesh! 💪
Catch the LIVE action ➡ https://t.co/37b07dyybB#CWC25 👉 #BANvENG | LIVE NOW on Star Sports &… pic.twitter.com/VGpETbtwOh
— Star Sports (@StarSportsIndia) October 7, 2025
వరల్డ్ కప్ తొలి పోరులో దక్షిణాఫ్రికాను 69కే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ ఈసారి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. స్పిన్నర్లు సోఫీ ఎకిల్‌స్టోన్(3-24), లిన్సే స్మిత్(2-33), అలిసే క్యాప్సే(2-31)లు విజృంభించగా బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు. టాస్ ఓడిన బంగ్లాకు ఐదో ఓవర్లలోనే లారెన్ బెల్ ఓపెనర్ రుబియా హైదర్(4)ను ఔట్ చేసి బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఎకిల్ స్టోన్ ఎంటరవ్వడంతో బంగ్లాకు కష్టాలు మొదలయ్యాయి.
𝐍𝐢𝐠𝐚𝐫 𝐒𝐮𝐥𝐭𝐚𝐧𝐚 𝐉𝐨𝐭𝐲 𝐝𝐞𝐩𝐚𝐫𝐭𝐬 𝐟𝐨𝐫 𝐚 𝐝𝐮𝐜𝐤! 👀
Linsey Smith claims the big wicket, Bangladesh in trouble at 25/2 (5.3)! 🏏#CricketTwitter #CWC25 #BANvENG pic.twitter.com/5g7L14v2k4
— Female Cricket (@imfemalecricket) October 7, 2025
జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన షమీమ్ అక్తర్(30)ను ఆమె ఔట్ చేయగా లిన్సే స్మిత్, చ్లా డీన్ మిడిలార్డర్‌ను మడతపెట్టారు. ఈ స్పిన్ త్రయం తిప్పేయగా ఒక దశలో 59కే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ శోభణ మోస్త్రే (60) వీరోచిత అర్ధ శతకంతో కోలుకుంది. ఆమె తర్వాత వచ్చిన రబెయా ఖాన్(43 నాటౌట్) చివర్లో ధనాధన్ ఆడింది. స్మిత్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 6, 4 బాదిన రబెయా జట్టు స్కోర్ 170 దాటించింది. అయితే.. నాలుగో బంతికి షంజిద ఔట్ కావడంతో బంగ్లా 178 పరుగులకే ఆలౌటయ్యింది.