IND vs PAK : పొట్టి వరల్డ్ కప్ టోర్నీని ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్(Pakistan) కీలక మ్యాచ్‌లో టీమిండియాతో తలపడుతోంది. ఆతిథ్య యూఎస్ఏ(USA) చేతిలో దారుణ ఓటమితో రగిలిపోతున్న పాక్‌కు ఇది ఓ రకంగా చావోరేవో మ్యాచ్. వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌దే ఆధిపత్యం అయినా.. బౌన్సీ పిచ్ అయిన నస్సౌ కౌంటీలో దాయాది పేసర్లు చెలరేగే చాన్స్ ఉంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ఇంకొన్ని నిమిషాలే ఉందనగా.. బాబర్ ఆజాం బృందంలో పాక్ దగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) స్ఫూర్తినింపాడు.
‘ప్లీజ్ దేశం కోసం ఆడండి. పాకిస్థాన్ కోసం ఆడండి. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడకండి. ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్లను అభిమానులు అస్సలు గుర్తుంచుకోరు. ప్రజలు ఎల్లప్పుడు జట్టును గెలిపించిన ఆటగాళ్లను యాది చేసుకుంటారు. దయచేసి పాకిస్థాన్ గౌరవం కోసం ఆడండి’ అని అక్తర్ ఓ వీడియో పోస్ట్‌లో బాబర్ సేనను అభ్యర్థించాడు.
Pakistan, play out of your skin. Play for Pakistan. Don’t play for individual records. #INDvPAK pic.twitter.com/X1627TyiBd
— Shoaib Akhtar (@shoaib100mph) June 9, 2024