కరార(గోల్డ్‌కోస్ట్): ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొంది వన్‌డౌన్‌లో వచ్చిన ఆల్‌రౌండర్ శివం దూబూ(Shivam Dube) ఔటయ్యాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో దూబే 22 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో ఓ ఫోర్, సిక్సర్ ఉన్నాయి. దూబే ఓ భారీ సిక్సర్ కొట్టాడు. జంపా వేసిన బౌలింగ్‌లో అతను బంతిని స్టేడియం బయటకు కొట్టాడు. దీంతో కొత్త బంతిని తీసుకువచ్చారు. ఆ సిక్సర్‌కు చెందిన వీడియోను వీక్షించండి.
New ball please! Shivam Dube sent that one way out of the stadium 👀#AUSvIND pic.twitter.com/H5px77NuIa
— cricket.com.au (@cricketcomau) November 6, 2025
దీనికి ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ 6.4 ఓవర్ల వద్ద 28 పరుగుల వ్యక్తిగత స్కోరుకు ఔటయ్యాడు. అభిషేక్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 రన్స్ చేసింది.