పోర్ట్ఆఫ్ స్పెయిన్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ తమదైన జోరు కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తొలుత టాస్ గెలిచిన విండీస్..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ ధవన్ (99 బంతుల్లో 97, 10ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (64), శ్రేయాస్ అయ్యర్ (54) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 308/7 స్కోరు చేసింది. ఓపెనర్లు ధవన్, గిల్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 18 నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకొచ్చిన గిల్‌కు తోడు ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ధవన్ మంచి టచ్‌లోకి వచ్చాడు. పూరన్ సూపర్ త్రోతో గిల్ ఔట్ కాగా తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయ్యర్ కూడా అర్ధసెంచరీతో ఆకట్టుకోవడంతో భారీ స్కోరుకు బాటలు పడ్డట్లే కనిపించింది. అయితే ధవన్ 97 పరుగుల వద్ద ఔటై నిరాశపర్చగా, సూర్యకుమార్ (13), శాంసన్ (12), దీపక్ హుడా (27), అక్షర్ పటేల్ (21) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. జోసెఫ్ (2/61), మోతి (2/54) రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనకు దిగిన విండీస్ కడపటి వార్తలందేసరికి 10 ఓవర్లలో 52/1 స్కోరు చేసింది.