Shikhar Dhawan | ముంబై: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. అయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధవన్ ప్రస్తుతం ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో ప్రేమలో పడినట్లు తెలిసింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ధవన్‌తో కలిసి షైన్ స్టేడియంలో కనిపించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే టైమ్స్ నౌ సమ్మిట్ నిర్వహించిన కార్యక్రమంలో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ధవన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
పేరు చెప్పదల్చుకోలేనన్న గబ్బర్.. అద్భుత సౌందర్యవతి తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ కితాబిచ్చాడు. 17 నెలల క్రితం అయేషా నుంచి విడాకులు తీసుకున్న ధవన్.. ప్రస్తుతం ఈ ఐర్లాండ్ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు. 2024లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ధవన్.. చాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.