కొలంబో: శ్రీలంక టూర్‌కు వెళ్లిన ఇండియన్ టీమ్ క్వారంటైన్లో ఎంజాయ్ చేస్తోంది. స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ పృథ్వి షా ఓ ఫన్నీ గేమ్ ఆడుతూ టైంపాస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ గేమ్ పేరు మ్యూజిక్ అండ్ మైమ్ గెస్సింగ్ గేమ్. అంటే ఒకరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటే వాళ్ల చెవుల్లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. మరో వ్యక్తి ఏదైనా పదం చెబుతున్నట్లుగా పెదవులు కదిలిస్తారు. ఆ వ్యక్తి ఏం చెప్పారో మ్యూజిక్ వింటున్న వ్యక్తి గెస్ చేయాలి. ఇలా ధావన్, పృథ్వీ షా మధ్య సరదాగా సాగిన ఆటకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను ట్విటర్లో పోస్ట్ చేసింది బీసీసీఐ. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో బోర్డు వెబ్సైట్లో ఉంది. ఈ గేమ్‌లో భాగంగా శ్రీలంక టూర్‌కు వెళ్లిన ఇండియన్ ప్లేయర్స్ ఎవరో ధావన్ గెస్ చేయాల్సి ఉండగా.. ఫుడ్ ఐటమ్స్ పేర్లను పృథ్వీ చెప్పాల్సి ఉంటుంది.
Loud music blaring in your ears 🎶
— BCCI (@BCCI) July 1, 2021
Your teammate miming & mouthing words 🗣️
This guessing game takes a hilarious turn very soon 😄 #TeamIndia #SLvIND
Presenting Music & Mime ft. @SDhawan25 & @PrithviShaw 😎 – by @ameyatilak
Full video 🎥 👇 https://t.co/nzOZEZjeC3 pic.twitter.com/ZxfxDGj1Ok