 
                                                            WI vs BAN : పొట్టి క్రికెట్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ (Romario Shepherd) హ్యాట్రిక్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో అతడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. తద్వారా ఈ ఫార్మాట్లో హ్యాట్రిక్ తీసిన రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వరుస బంతుల్లో నురుల్ హసన్, తంజిమ్ హసన్, షొరిఫుల్ ఇస్లాం లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. అతడికంటే ముందు జేసన్ హోల్డర్ (Jason Holder) 2022లో ఇంగ్లండ్‌పై వరుసగా మూడు వికెట్లతో చెలరేగాడు.
రొమారియో షెపర్ట్ విజృంభణతో బంగ్లాదేశ్ 151కే ఆలౌటయ్యింది. అనంతరం భారీ ఛేదనలో వెస్టిండీస్ ఆదిలోనే కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్ల ధాటికి 52కే మూడు వికెట్లు పడినా రోస్టన్ ఛేజ్(50), అకీమ్ అగస్టన్(50)లు అర్ధ శతకాలతో చెలరేగారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలుపువాకిట నిలిపారు. విజయానికి 9 పరుగుల దూరంలో రోస్టన్, అకీమ్ ఔటైనా.. రోవ్‌మన్ పావెల్(5 నాటౌట్) జతగా గుడకేశ్ మోతీ(3 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. దాంతో.. విండీస్ జట్టు స్వదేశం బయట మొదటిసారి టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Nurul Hasan ❌
Tanzid Hasan ❌
Shoriful Islam ❌Romario Shepherd becomes the second West Indies player to take a hat-trick in men’s T20Is! 🔥 #BANvWI pic.twitter.com/9VdPHd0ge8
— ESPNcricinfo (@ESPNcricinfo) October 31, 2025
 
                            