హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) నిర్వహించిన ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ 2026 టోర్నమెంట్ జంపింగ్ ఈవెంట్లలో శౌర్యరామ్ వర్మ, ఈషాన్ భరద్వాజ్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. గండిపేటలోని హెచ్పీఆర్సీలో జరిగిన అండర్14 విబాగంలో ఆర్చి హార్స్ రైడింగ్ అకాడమీకి చెందిన శౌర్యరామ్, ధన్వి (ఫ్లయింగ్ సీ స్టాలియన్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఓపెన్ కేటగిరీలో ఆర్చి హార్స్ రైడర్లు ఈషాన్ స్వర్ణం, ఎ. చంద్రశేఖర్ రజతం గెలిచారు. అండర్ 12 జంపింగ్ 40 సెంటీమీటర్ల పోటీలో ఫైజాన్ ఖాన్ (స్టాలియన్ అకాడమీ), తేజ డియోర్ (బిలియనీర్ క్లబ్) టాప్-2లో నిలిచారు. హెచ్పీఆర్సీ ప్రెసిడెంట్ చైతన్య ఆర్. కుమార్, వైస్ ప్రెసిడెంట్ విజేందర్ సింగ్, సెక్రటరీ రియాజ్ అహ్మద్ విజేతలకు పతకాలు అందజేశారు.