Ranji Tophy : రంజీ ట్రోఫీ 2025-26 కోసం ముంబై (Mumbai)సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించారు. 42 సార్లు ఛాంపియన్ అయిన ముంబైకి ఈసారి శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సారథ్యం వహించనున్నాడు. ఈ మధ్యే అజింక్యా రహానే (Ajinkya Rahane) కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో అనుభవజ్ఞుడైన ఠాకూర్‌కు పగ్గాలు అప్పగించారు సెలెక్టర్లు.
ముంబై సెలెక్టర్లు శుక్రవారం 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఖాన్ బ్రదర్స్ సర్ఫరాజ్, ముషీర్ ఖాన్లకు చోటు లభించింది. ఆసియా కప్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్ శివం దూబే సైతం స్క్వాడ్‌లో ఉన్నాడు. గత కొంతకాలంగా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షామ్స్ ములానీ, తనుష్ కొతియాన్, తుషార్ దేశ్‌పాండేలు సైతం ఎంపికయ్యారు.
🚨 BREAKING 🚨
Mumbai has announced its squad for the first Ranji Trophy match against Jammu & Kashmir on October 15. 🏆#Cricket #Mumbai #RanjiTrophy #Sportskeeda pic.twitter.com/mBARq0v1mt
— Sportskeeda (@Sportskeeda) October 10, 2025
ముంబై రంజీ స్క్వాడ్ : శార్దూల్ ఠాకూర్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, ఆకాశ్ ఆనంద్ (వైస్ కెప్టెన్), హార్దిక్ తమొర్ (వికెట్ కీపర్), సిద్దేశ్ లాడ్, అజింక్యా రహానే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, షామ్స్ ములానీ, తనుష్ కొతియాన్, తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్, ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, రొయ్స్టొన్ డియాస్.
దేశవాళీ క్రికెట్లో వరల్డ్ కప్‌తో సమానమైన రంజీ ట్రోఫీలో ముంబై జట్టుది తిరుగులేని ఆధిపత్యం. రికార్డు స్థాయిలో విజేతగా నిలిచిన ఆ జట్టు ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ‘ఎలైట్ గ్రూప్ డీ’లోని ముంబై జట్టు రంజీ ట్రోఫీ తొలి పోరులో జమ్ము కశ్మీర్‌ను ఢీకొట్టనుంది. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 18 వరకూ శ్రీనగర్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. గ్రూప్ డీలో హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి జట్లు ఉన్నాయి.