మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 17, 2021 , 11:18:53

హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన‌ శార్దూల్‌, సుంద‌ర్‌

హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన‌ శార్దూల్‌, సుంద‌ర్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు శార్దూల్ ఠాకూర్, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌. ప్ర‌ధాన బ్యాట్స్‌మెన్ అంద‌రినీ పెవిలియ‌న్‌కు పంపించేసామ‌ని సంబ‌ర‌ప‌డిన కంగారూల‌ను గ‌ట్టి దెబ్బే కొట్టారు. ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఇప్ప‌టికే ఏడో వికెట్‌కు సెంచ‌రీకిపైగా పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్ప‌డం విశేషం. 186 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఈ ఇద్ద‌రు బౌల‌ర్లూ ఆదుకున్నారు. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో ఆసీస్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన ఈ ఇద్ద‌రూ.. ఆతిథ్య జ‌ట్టు ఆధిక్యాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కూ త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సుంద‌ర్ హాఫ్ సెంచరీ చేయ‌గా.. అటు శార్దూల్ ఠాకూర్ కూడా కెరీర్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ చేయ‌డం విశేషం. ఈ ఇద్ద‌రి జోరుతో టీమిండియా స్కోరు ఇప్ప‌టికే 300 దాటింది. చివ‌రికి 67 ప‌రుగులు చేసిన శార్దూల్.. క‌మిన్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. సుంద‌ర్‌తో క‌లిసి ఏడో వికెట్‌కు 123 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డం విశేషం. గ‌బ్బా స్టేడియంలో ఇండియ‌న్ టీమ్‌కు ఏడో వికెట్‌కు ఇదే అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌.

VIDEOS

logo