IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆదిలోనే లక్నో పేసర్ శార్థూల్ ఠాకూర్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. మొదట ఓపెనర్ అభిషేక్ శర్మ(6), గత మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్(0)లను వెనక్కి పంపాడు. 15 పరుగులకే రెండు వికెట్లు పడినా ఓపెనర్ ట్రావిస్ హెడ్(42) దూకుడు ఆడుతున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి(11)తో కలిసి స్కోర్‌బోర్డును నడిపిస్తున్నాడు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగుతున్నారు. దాంతో, కమిన్స్ సేన పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 62 స్కోర్ చేసింది.
టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి భారీ స్కోర్ కొడుతుందని అనుకుంటే శుభారంభం దక్కలేదు. శార్ధూల్ ఠాకూర్ వరుస బంతుల్లో డేజంరస్ అభిషేక్ శర్మ(6), ఇషాన్ కిషన్(0)లను ఔట్ చేసి హైదరాబాద్‌కు షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి పూరన్ చేతికి దొరికాడు అభిషేక్. లెగ్ సైడ్ వచ్చిన బంతిని ఆడి వికెట్ కీపర్ పంత్‌కు సులువైన క్యాచ్ ఇచ్చాడు ఇషాన్.
Buzzing with that start, @LucknowIPL fans? 🔥 😌
Shardul Thakur removes the dangerous duo of Abhishek Sharma and Ishan Kishan ☝☝
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @imShard pic.twitter.com/q5pqTEiskV
— IndianPremierLeague (@IPL) March 27, 2025
దాంతో, 15 పరుగుల వద్ద హైదరాబాద్ తొలి రెండు వికెట్లు కోల్పోయింది. శార్ధూల్ హ్యాట్రిక్ బంతిని నితీశ్ కుమార్ రెడ్డి(11) అడ్డుకొని వేగంగా సింగిల్ తీశాడు. ఆ తర్వాత అవేశ్ ఖాన్‌ను టార్గెట్ చేసిన హెడ్ 6, 6, 4తో 18 పరుగులు పిండుకున్నాడు. బిష్ణోయ్ వేసిన 6వ ఓవర్లో హెడ్ సిక్సర్ బాది జట్టు స్కోర్ 50 దాటించాడు.