చెన్నై: తన కెరీర్లో ఆఖరి టోర్నీ ఆడుతున్న భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమాల్.. టైటిల్ వేటను విజయంతో ప్రారంభించాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శరత్.. 3-0తో అనిర్భన్ ఘోష్‌ను ఓడించి రెండో రౌండ్‌కు చేరాడు.
పురుషుల డబుల్స్‌లో శరత్-స్నేహిత్ ద్వయం.. 3-2తో లుమ్-లూ (ఆస్ట్రేలియా) జోడీని ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది.