T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో బంగ్లాదేశ్ క్రికెట్(Bangladesh Cricket) బోర్డు తుది స్క్వాడ్‌ను ప్రకటించింది. నజ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto) కెప్టెన్‌గా, సీనియర్ పేసర్ తస్కిన్ అహ్మద్ వైస్ కెప్టెన్‌గా.. 15 మందితో కూడిన బృందాన్ని మంగళవారం బంగ్లా క్రికెట్ వెల్లడించింది.
మోగా టోర్నీని సీరియస్‌గా తీసుకున్న సెలెక్టర్లు బలమైన బృందాన్ని ఎంపిక చేశారు. కొన్నాళ్లుగా పొట్టి క్రికెట్ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాడు మహ్మదుల్లాకు సెలెక్టర్లు తుది స్క్వాడ్‌లో చోటు కల్పించారు. ఇక అండర్ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన తౌహిద్ హృదయ్ టీ20 వరల్డ్ కప్ బెర్తు దక్కించుకున్నాడు. బంగ్లా స్క్వాడ్‌లో ఉన్న సీనియర్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ (Shakib Al Hasan)కు బహుశా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ కావొచ్చు.
Bangladesh Squad | ICC Men’s T20 World Cup West Indies & USA 2024 🫶 🇧🇩 #BCB #Cricket #T20WorldCup 2024 pic.twitter.com/GKJ89MzeLL
— Bangladesh Cricket (@BCBtigers) May 14, 2024
బంగ్లాదేశ్ స్క్వాడ్ : నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తస్కిన్ అహ్మద్(వైస్ కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, తంజిద్ హసన్ తమీమ్, షకిబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా రియాద్, జకేర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షక్ మహెది హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజీం హసన్ షకీబ్.
అంతర్జాతీయ క్రికెట్లో సంచలనాలకు చిరునామాగా మారిన బంగ్లాదేశ్ ఈసారి సీనియర్లు, జూనియర్ల కాంబినేషన్‌తో పటిష్టంగా కనిపిస్తోంది. నిరుడు వన్డే వరల్డ్ కప్, ఆసియాకప్ వైఫల్యం తర్వాత బంగ్లాదేశ్ టెస్టు, వన్డే, టీ20ల్లో అదరగొట్టింది. అదే ఉత్సాహంతో వెస్టిండీస్, అమెరికా గడ్డపై కూడా చెలరేగాలని శాంటో బృందం పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ జూన్ 8న తొలి పోరులోశ్రీలంకతో తలపడనుంది.