హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా మహిళల అండర్-17 వాలీబాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ యువ క్రీడాకారిణి శాంతకుమారి చోటు దక్కించుకుంది. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో శాంతకుమారి దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన శాంతకుమారి బాలానగర్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఫిజికల్ డైరెక్టర్ అరుణ్ శిక్షణలో రాటుదేలిన ఈ యువ కెరటం జాతీయ స్థాయి టో ర్నీల్లో సత్తా చాటుతున్నది. రాష్ట్ర వా లీబాల్ సంఘం అధ్యక్షుడు రమేశ్బా బు, కార్యదర్శి హన్మంతరెడ్డి సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని శాంతకుమారి చెప్పింది.