లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కొన్ని రోజుల క్రితం థాయ్‌ల్యాండ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. తన విల్లాలో స్పృహతప్పిన పరిస్థితిలో ఉన్న వార్న్‌ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా వార్న్ కళ్లు తెరవలేదు. చివరకు వార్న్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
గుండెపోటుతోనే ఈ క్రికెట్ దిగ్గజం మరణించినట్లు అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని వార్న్‌ది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. వార్న్ చిన్నతనం నుంచి ఉన్న వ్యాధి కారణంగానే అంటే కాంజెషినల్ డిసీజ్ వల్లే మరణించినట్లు పోస్టుమార్టం చెప్తోంది. ఈ రిపోర్టును వార్న్ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని సమాచారం.
మంగళవారం నాడు వార్న్ భౌతికకాయాన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్తారు. వార్న్ మృతిపై ప్రముఖ క్రికెటర్లంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2013లో అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్న్.. కామెంటేటర్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు.