Srilanka Cricket : టీ20 ప్రపంచకప్ కోసం సమీపిస్తున్న వేళ శ్రీలంక సెలెక్టర్లు కెప్టెన్ చరిత అలసంక(Charith Asalanka)కు బిగ్ షాకిచ్చారు. స్వదేశంలో జరుగబోయే మెగా టోర్నీలో లంకను నడిపించాలనుకున్న అతడికి చెక్ పెడుతూ.. మాజీ సారథి దసున్ శనక (Dasun Shanaka)కు మళ్లీ పగ్గాలు అప్పగించారు. ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శనకు అలసంక భారీ మూల్యం చెల్లించుకోగా.. అనుభవజ్ఞుడైన శనకపై విశ్వాంసం ఉంచారు. ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా స్వదేశంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం శుక్రవారం 25 మందితో కూడిన ప్రీ- స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. ఇందులో అసలంక కూడా ఉన్నాడు.
మరో రెండు నెలల్లో భారత్, శ్రీలంక టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోదయ విక్రమసింఘే నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అలసంక ఫామ్‌లేమిని ఎత్తిచూపుతూ వేటు వేసింది. మూడు పొట్టి ప్రపంచకప్‌లు ఆడిన అనుభవమున్న శనకను కెప్టెన్‌గా నియమించారు.
🚨 NEWS ALERT 🚨
Dasun Shanaka has been appointed as the captain of Sri Lanka for the T20I World Cup 2026. 🏆#Cricket #Shanaka #SriLanka pic.twitter.com/lBE087ecOe
— Sportskeeda (@Sportskeeda) December 19, 2025
‘ఆల్‌రౌండర్‌గా శనక పాత్ర కీలకమైనది. దీర్ఘకాలికంలో సారథిగా అసలంకను అనుకున్నాం. అయితే.. ఇటీవల కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. ఇకపై కెప్టెన్సీ ఒత్తిడి లేనందున అలసంక త్వరలోనే టచ్‌లోకి వస్తాడని అనుకుంటున్నా’ అని విక్రమసింఘే తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ప్రపంచకప్ షురూ కానుంది.
శ్రీలంక స్క్వాడ్ : దసున్ శనక(కెప్టెన్), పథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, కమిల్ మిశ్రా, కుశాల్ పెరీరా, ధనుంజయ డిసిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియనగే, చరిత అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్ననాయకే, శహాన్ అరచ్చిగే, హసరంగ, దునిత్ వెల్లలాగే, మిలాన్ రత్ననాయకే, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, చమీర, ప్రమోద్ మదుషాన్, మథీశ పథిరన, దిల్షాన్ మధుశనక, మహీశ్ థీక్షణ, దుషాన్ హేమంత, విజయకాంత్ వైషాక్, త్రవీన్ మథ్యూ.