Mohammad Shami : ఒకప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్ అయిన మహమ్మద్ షమీ (Mohammad Shami) ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్న అతడు పునరాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు. రంజీలు, దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా సరే సెలెక్టర్లు మొండిచేయి చూపించడంపై షమీ మండిపోతున్నాడు. అంతేకాదు స్క్వాడ్ సెలెక్షన్ ముందు తనను సంప్రదించామని, ఫిట్‌గా లేనందునే పక్కనపెట్టేశామని చెబుతున్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఫిట్నెస్ విషయమై భారత జట్టు, ఛీప్ సెలెక్టర్.. ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. నాకు నేనుగా ఫిట్నెస్ గురించి చెప్పడం సరికాదు. కెప్టెన్, కోచ్ నన్ను అడగాలి. నేను నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడగలిగినప్పుడు.. వన్డేలు ఆడలేనా?. ఒకవేళ నేను ఫిట్‌గా లేకపోతే గమ్మున నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరేవాడిని. అంతేతప్ప.. రంజీ ట్రోఫీ కోసం సిద్ధమయ్యేవాడిని కాదు కదా’ అని షమీ వెల్లడించాడు. త్వరలోనే ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగనున్నాడు. తమ జట్టు పేస్ దశంలోని ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, ఇషాన్ పొరెల్తో కలిసి నిప్పులు చెరిగేందుకు రెఢీ అవుతున్నాడీ వెటరన్.
“Update lene ke liye, update maangna padhega,” he responds to Ajit Agarkar saying he wasn’t updated with his fitness status.
Mohammad Shami looked good in the nets today. He has shed a few kilos. All set for Uttarakhand tomorrow. #RanjiTrophy pic.twitter.com/hUXLF7dHif
— Srinjoy Sanyal (@srinjoysanyal07) October 14, 2025
రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు షమీ. సర్జరీ ఆ తర్వాత కోలుకున్నా సరే మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడీ పేస్ గన్. ఆస్ట్రేలియా పర్యటనకు తీసకోకపోయినా ఇంగ్లండ్ సిరీస్‌కు అయినా ఎంపిక చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, సెలెక్టర్లు అతడికి షాకిస్తూ.. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రానాలను ఎంపిక చేశారు. స్వదేశంలో ముగిసిన వెస్టిండీస్ సిరీస్‌కు కూడా షమీని పక్కనపెట్టేశారు సెలెర్లు. విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు స్క్వాడ్ ప్రకటన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో.. షమీ గురించిన తాజా సమాచారం లేదని అన్నాడు.
‘దులీప్ ట్రోఫీలో షమీ ఆడినట్టు చెబుతున్నారు. కానీ, గత రెండు మూడేళ్లలో అతడు క్రికెట్ ఆడింది చాలా తక్కువ. అతడు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది’ అని చీఫ్ సెలెక్టర్ చెప్పాడు. దాంతో.. ఇక ఈ స్పీడ్‌స్టర్ ఇప్పట్లో భారత జెర్సీ వేసుకోవడం అసాధ్యమేనని సంకేతాలు ఇచ్చాడు అగార్కర్. అంతేకాదు.. అక్టోబర్ 19 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు సైతం షమీని పరగణించలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒకప్పుడు అత్యుత్తమ పేసర్‌గా వెలుగొందిన అతడు కెరీర్ ముగింపు దశకు చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
🚨 BREAKING 🚨
Mohammad Shami is set to play for Bengal in the 2025–26 Ranji Trophy, starting on October 15. 🏆#Cricket #Shami #Bengal #RanjiTrophy pic.twitter.com/1NLR3Rrb5x
— Sportskeeda (@Sportskeeda) October 8, 2025
🚨 BREAKING 🚨
Mohammad Shami is set to play for Bengal in the 2025–26 Ranji Trophy, starting on October 15. 🏆#Cricket #Shami #Bengal #RanjiTrophy pic.twitter.com/1NLR3Rrb5x
— Sportskeeda (@Sportskeeda) October 8, 2025