బెంగుళూరు: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఇవాళ చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ( Mohammed Shami) ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్‌లో 17 బంతుల్లో 32 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత 4 ఓవర్లలో అతను 13 డాట్ బాల్స్ వేశౄడు. థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 4 రన్స్ తేడాతో విజయం సాధించింది. 34 ఏళ్ల షమీ ఎస్ఎంఏటీ టీ20 టోర్నీలో 8వ మ్యాచ్ ఆడాడు. అతను ఫుల్ కోటా బౌలింగ్ చేశాడు.
ఫిట్నెస్ను నిరూపించుకుంటున్న షమీ.. ప్రస్తుతం ఆ టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్నాడు. సందీప్ శర్మ వేసిన ఫైనల్ ఓవర్లో అతను 19 రన్స్ రాబట్టాడు. నిర్ణీత ఓవర్లలో బెంగాల్ 9 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. 114 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో షమీ తన బ్యాట్‌తో పవర్ షాట్లు కురిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. 160 టార్గెట్‌తో బరిలోకి దిగిన చండీఘడ్.. 9 వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది.
Mohammed Shami 32(17), all rounder ra 🥵pic.twitter.com/Muq3iWS3CR
— low battery 🧡 (@low__battery287) December 9, 2024