West Indies Squad : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పట్టికలో ముందంజ వేయాలనుకుంటున్న వెస్టిండీస్ (West Indies)కు భారత పర్యటనకు ముందే వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. టీమిండియాపై రెండు టెస్టుల సిరీస్ గెలుపొందాలనే కసితో ఉన్న ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే యువ పేసర్ షమర్ జోసెఫ్ (Shamar Joseph)వైదొలగగా.. ఇప్పుడు సీనియర్ పేసర్ అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph) సేవల్ని కూడా విండీస్ కోల్పోనుంది.
ఈమధ్యే గాయం నుంచి కోలకున్న జోసెఫ్ భారత్‌పై చెలరేగాలని భావించాడు. కానీ, అతడికి వెన్ను గాయం తిరగెట్టింది. దాంతో.. స్కానింగ్ పరీక్షల అనంతరం అతడికి విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. సో.. వెస్టిండీస్ ప్రధాన పేస్ అస్త్రం అయిన జోసెఫ్ రెండు టెస్టుల సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను ఎంపిక చేయాలనుకున్నారు సెలెక్టర్లు. కానీ, అతడు నిరాకరించడంతో అన్‌క్యాప్ట్ ప్లేయర్ జెడియహ్ బ్లేడ్స్(Jediah Blades)ను తీసుకున్నారు.
Squad Update 🚨
Alzarri Joseph has been ruled out of the upcoming test series against India due to a lower back injury.
After complaints of discomfort, scans revealed a degeneration of the previously resolved lower back injury. pic.twitter.com/k4DfzLb0e7
— Windies Cricket (@windiescricket) September 29, 2025
ప్రస్తుతం యూఏఈ గడ్డపై నేపాల్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న బ్లేడ్స్.. ఈ సిరీస్ ముగియగానే భారత్‌కు రానున్నాడు. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా నడ్డివిరిచిన షమర్ జోసెఫ్ సైతం భారత పర్యటనకు దూరమమైన విషయం తెలిసిందే. షమర్ స్థానంలో 22 ఏళ్ల ఆల్‌రౌండర్ జొహన్ లేనే (Johann Layne)ను స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు. జొహన్ది కూడా బార్బడోస్ కావడం విశేషం.
వెస్టిండీస్ స్క్వాడ్ : రోస్టన్ ఛేజ్(కెప్టెన్), జొమెల్ వర్రికన్(వైస్ కెప్టెన్), కెవ్లన్ అండర్సన్, అలిక్ అథనజే, జాన్ క్యాంప్‌బెల్, తగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రేవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జెడియహ్ బ్లేడ్స్, జొహన్ లేనే, బ్రాండన్ కింగ్, అండరన్సర్ ఫిలిప్, ఖారీ ఫీఎర్రీ, జైడన్ సీల్స్.
Not a good sign for West Indies ahead of their Test series against India! 🌴👀
Their star duo will miss the series due to injuries, and senior all-rounder Jason Holder is unavailable for the series! 🏏#AlzarriJoseph #WIvIND #Tests #Sportskeeda pic.twitter.com/FmBf2HxFvs
— Sportskeeda (@Sportskeeda) September 29, 2025
ఇంగ్లండ్ పర్యటన తర్వాత స్వదేశంలో శుభ్‌మన్ గిల్ సేనకు ఇదే మొదటి టెస్టు సిరీస్. విండీస్, టీమిండియా మధ్య అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో తొలి టెస్టు మొదలవ్వనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత జట్టు మూడో స్థానంలో ఉండగా.. కరీబియన్ టీమ్ ఆరో స్థానంలో ఉంది.