Shamar Joseph: విండీస్ సంచలన పేసర్, ఇటీవలే ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా ముగిసిన టెస్టులో సంచలన స్పెల్‌తో క్రికెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన షమర్ జోసెఫ్ ఆటను టీ20లలో చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. గబ్బా టెస్టులో ఏడు వికెట్లు తీసి విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన జోసెఫ్..ఈ సిరీస్ ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)లో దుబాయ్ క్యాపిటల్స్‌లో ఆడాల్సి ఉంది. కానీ కాలి బొటనవేలి గాయం కారణంగా ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు.
గబ్బా టెస్టులో కాలి గాయం వేధిస్తున్నా బౌలింగ్‌కు దిగి ఏడు వికెట్లు పడగొట్టిన జోసెఫ్.. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా ఇంటికి పయనమయ్యాడు. అక్కడే అతడు చికిత్స తీసుకోనున్నాడు. త్వరలో పాకిస్తాన్ వేదికగా మొదలుకావాల్సి ఉన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడాల్సి ఉంది. పీఎస్ఎల్లో అతడు పెషావర్ జెల్మీ తరఫున ఆడనున్నాడు. అయితే ఈ లీగ్ కంటే ముందే ఈ ఏడాది జనవరి 19న మొదలైన ఐఎల్ టీ20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడాల్సి ఉంది. కానీ ఆసీస్‌తో సిరీస్ తర్వాత ఈ లీగ్‌లో జాయిన్ అయ్యేందుకు అతడు భావించినా కాలిగాయంతో జోసెఫ్ ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు.
Shamar Joseph ruled out of the ILT20 due to a toe injury which he suffered at the Gabba Test. (Espncricinfo). pic.twitter.com/RrTouoWMPd
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2024
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా పెషావర్ జల్మీ తరఫున గస్ అట్కిన్సన్ రిప్లేస్‌మెంట్‌గా జోసెఫ్ ఆడనున్నాడు. వచ్చే నెలలో పీఎస్ఎల్ మొదలుకావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ టోర్నీ ఆరంభం నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమై సత్తాచాటాలని జోషెఫ్ భావిస్తున్నాడు. ఈ లీగ్‌లో గనక జోసెఫ్ మెరిస్తే ఇక అంతర్జాతీయంగా టీ20 ఫ్రాంచైజీలు ఈ విండీస్ పేసర్ వెనకపడటం ఖాయం.
Every angle, every call – how the broadcasters celebrated Shamar Joseph and the West Indies’ historic Gabba win #AUSvWI pic.twitter.com/zainOcQ79C
— cricket.com.au (@cricketcomau) January 28, 2024