Shakib Al Hasan : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) పునరాగమనంపై అనిశ్చితి కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన షకీబ్ ఏడాది కాలంగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఆసియా కప్ (Asia Cup) స్క్వాడ్‌లోనూ చోటుదక్కకపోవడంతో ఈ మేటి ఆల్‌రౌండర్ కథ ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రీడా శాఖ సలహాదారు సంచలన కామెంట్ చేశాడు. ఇక షకీబ్ కెరీర్ ముగిసిందని, అతడు మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇక కల్లే అని ఆసిఫ్ మహముద్ (Asif Mahmud) అన్నాడు.
ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్ అయిన షకీబ్ సేవలు బంగ్లాకు ఎంతో అవసరం. కానీ, ఉన్నట్టుండి ఆ దేశ క్రీడా సలహాదారు మాత్రం అతడు మా టీమ్‌కు వద్దే వద్దు అనడానికి బలమైన కారణముంది. అదేంటంటే.. మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు షకీబ్. దాంతో, చిర్రెత్తుకొచ్చిన తాత్కాలిక ప్రభుత్వం అతడిని పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది. అందుకే అసిఫ్ తన ఫేస్బుక్లో పరోక్షంగా షకీబ్‌ను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు.
Wishing Sheikh Hasina Wajid on her birthday turned out to be costly for Shakib Al Hasan.#ShakibAlHasan | #SheikhHasina | #HasinaWajid | #BangladeshCricket | #Bangladesh pic.twitter.com/yfoo493NcC
— Mohammad Ashir Asif (@ashirasif48) September 30, 2025
‘ఒక వ్యక్తిని రిహాబిలిటేషన్‌కు తీసుకోవడం లేదని మీరంతా నన్ను విమర్శిస్తున్నారు. కానీ, అతడి విషయంలో నేను సరైందే చేస్తున్నా. ఇక అతడిని జట్టులోకి తీసుకొనే అవకాశమే లేదు. ఇందులో చర్చలకు ఆస్కారమే లేదు’ అని అసిఫ్ పేర్కొన్నాడు. తనను లక్ష్యంగా చేసుకొని క్రీడా సలహాదారు పెట్టిన పోస్ట్‌పై షకీబ్ స్పందించాడు. ‘ఎట్టకేలకు ఒక వ్యక్తి వల్లనే నేను బంగ్లాదేశ్ జెర్సీ ధరించడం లేదని అతడు అంగీకరించాడు. అవును.. అతడి కారణంగానే నేను బంగ్లాకు మళ్లీ ఆడలేకపోయాను. అయితే.. నేను ఏదో ఒకరోజు స్వదేశం వస్తాను. లవ్ యూ.. బంగ్లాదేశ్’ అని షకీబ్ కౌంటర్ ఇచ్చాడు.
🚨 BIG UPDATE FROM BANGLADESH 🚨
Sports Advisor Asif Mahmud has said Shakib Al Hasan will never play for Bangladesh again after his recent social media post. 😱
He confirmed he’ll ask BCB not to select the star all-rounder.#ShakibAlHasan #BCB pic.twitter.com/99JvDZa9Fz— Rana Ahmed (@RanaAhmad056) September 30, 2025
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ (Awami League) ఎంపీ అయిన షకీబ్ నిరుడు హత్యానేరం ఎదుర్కొన్నాడు. జనవరిలో విద్యార్థుల ఉద్యమం కారణంగా అతడు ఎంపీ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఆడిన షకీబ్.. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేదు. ప్రస్తుతానికి విదేశాల్లో ఉంటున్న అతడు.. ఫ్రాంచైజీ లీగ్స్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు.