Asia Cup 2023 : బంగ్లాదేశ్తో జరుగుతున్న ఆసియా కప్(Asia Cup 2023) చివరి సూపర్ 4 మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్ యాదవ్(26) ఔటయ్యాడు. షకిబుల్ హసన్(shakib al hasan) వేసిన 33వ ఓవర్లో సూర్య బౌల్డ్ అయ్యాడు. దాంతో, 139 పరుగుల వద్ద ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(74 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. భారత జట్టు విజయానికి ఇంకా 127 పరుగులు కావాలి. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.
లక్ష్య ఛేదనలో ఇండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0) డకౌటయ్యాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హొసేన్ షకిబ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో హిట్మ్యాన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో, ఇండియా 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వన్డేల్లో తంజిమ్కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. తొలి మ్యాచ్ ఆడుతున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ(5) నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్(19), ఇషాన్ కిషన్(5) వెంట వెంటనే ఔట్ కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది.