Shakib Al Hasan : టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) ఫామ్ అందుకున్నాడు. కీలక పోరులో సత్తా చాటిన షకీబ్ అజేయ అర్థ శతకంతో బంగ్లాను సూపర్- 8కు చేరువ చేశాడు. నెదర్లాండ్స్ (Netherlands) మ్యాచ్ అనంతరం ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) తనను విమర్శించడంపై షకీబ్ స్పందిస్తూ.. అసలు సెహ్వాగ్ ఎవరు చెప్పడానికి?. అతడు క్రికెటర్లకు సలహాలు ఇవ్వకుండా రిటైర్మెంట్ తీసుకోవాలి అని అన్నాడు.
అంతే.. చిర్రెత్తుకొచ్చిన వీరూ ఫ్యాన్స్ ఆన్లైన్లో షకీబ్‌ను తీవ్రంగా ట్రోల్ం చేస్తున్నారు. ‘నీకు సెహ్వాగ్ ఎవరో తెలియదా?.. బంగ్లాపై వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన వీరుడు’ అంటూ వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు.
There are people #Shakib who don’t know who their Baap #Sehwag is we can only feel sympathy for such people 👊👊👊
But then
He is from a country that does not remember who saved them from the atrocities of their Step-Dad
& liberated themBoth deserve the fate they are in.
😎😎😎 pic.twitter.com/9c4iS082a3— Wondering Woman 🇮🇳 (@indiclogic) June 14, 2024
మెగా టోర్నీలో బంగ్లాదేశ్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. దక్షిణాఫ్రికాపై గెలవాల్సిన మ్యాచ్‌ను కాస్త 4 పరుగుల తేడాతో అప్పగించేసింది. దాంతో, సుదీర్ఘ అనుభవజ్ఞుడైన అయిన షకీబ్‌పై సెహ్వాగ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. బంగ్లా ఓటమికి షకీబ్ సిగ్గు పడాలని, అతడు వెంటనే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని వీరూ అన్నాడు. ఆ మాటల్ని గుర్తు పెట్టుకున్న షకీబ్.. నెదర్లాండ్స్‌పై చెలరేగాడు. 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Meanwhile, Sehwag at Mirpur in 2011.
Audacity to say, “Sehwag who”. https://t.co/TSYINKtUU5 pic.twitter.com/i1VyjOLoZC— Lord Durgesh (@hardikpandya39) June 14, 2024
అనంతరం సెహ్వాగ్ కామెంట్స్‌పై నోరు విప్పిన ఈ ఆల్‌రౌండర్.. ‘నా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సెహ్వగ్‌కు ఇచ్చేస్తాను. అతడిని క్రికెటర్లకు పాఠాలు చెప్పడం నుంచి వీడ్కోలు తీసుకోవాలి’ అని గట్టి కౌంటర్ ఇచ్చాడు. అక్కడితో మొదలు టీమిండియ మాజీ డాషింగ్ ఓపెనర్ బంగ్లాపై ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ ఫొటోలతో షకీబ్‌ను ఆడేసుకుంటున్నారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసక ఓపెనర్ల జాబితాలో సెహ్వాగ్ ఒకడు. తొలి బంతి నుంచే బౌలర్లకు తన ఉద్దేశాన్ని చాటే వీరూ పవర్ ప్లే కింగ్‌గా.. కనికరమేలేని హిట్టర్‌గా పేరొందిన విషయం తెలిసిందే.