CPL T20 : క్రికెట్లో కొందరు విచిత్రంగా ఔట్ అవుతుంటారు. రెండేళ్ల క్రితం వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) ఆలస్యంగా క్రీజులోకి వచ్చి ‘టైమ్డ్ ఔట్’ (Timed Out) అయ్యాడు. అలానే ఊహించని విధంగా హిట్‌వికెట్ అయ్యి వార్తల్లో నిలిచిన ఆటగాళ్లూ ఉన్నారు. ఇప్పుడు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (Shai Hope) అందరూ అవాక్కయ్యేలా హిట్‌వికెట్ అయ్యాడు. సొంతగడ్డపై జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL T20)లో ఈ డాషింగ్ బ్యాటర్ వైడ్ బంతిని ఆడబోయి వెనుదిరిగాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతున్న షాయ్ హోప్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రిన్బగో నైట్ రైడర్స్ బౌలర్ టెర్రన్సే హిండ్స్ వేసిన వైడ్ బంతిని థర్డ్ మ్యాన్ దిశగా స్విచ్ హిట్ షాట్ ఆడబోయాడు. కానీ, బంతి మిస్ కాగా అతడి బ్యాట్ అనుకోకుండా వికెట్లకు తగిలింది. ఇంకేముంది చూస్తుండగానే అంపైర్ అతడిని హిట్‌వికెట్‌గా ప్రకటించాడు. ఊహించని విధంగా ఔట్ కావడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు హోప్. ప్రస్తుతం అతడు హిట్ వికెట్‌గా ఔటైన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Unbelievable scenes! 😮
Hit wicket off a wide! 💥#CPL25 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #Sky365 pic.twitter.com/L89OhDqcuB
— CPL T20 (@CPL) August 31, 2025
షోప్ 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యేసరికి గయనా జట్టు స్కోర్.. 109/7. ఆ తర్వాత డ్వేన్ ప్రిటోరియస్ (16 బంతుల్లో 21), క్వెంటిన్ సాంప్సన్(9 బంతుల్లో 25) ఎనిమిదో వికెట్‌కు 48 రన్స్ జోడించి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. అయితే.. ట్రిన్బగ్ ఓపెనర్లు కొలిన్ మన్రో(52), అలెక్స్ హేల్స్(74) సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. గయనా కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ నాలుగు వికెట్లు తీసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.