న్యూఢిల్లీ: షహీన్ షా అఫ్రిది(Shaheen Shah Afridi) ఖాతాలో మరో రికార్డు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఆ ఫాస్ట్ బౌలర్ వన్డేల్లో వంద వికెట్లు తీశాడు. అత్యంత తక్కువ వన్డేల్లో ఆ రికార్డును అందుకున్న పాక్ బౌలర్‌గా అతను ఘనత సాదించాడు. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హసన్‌ను ఔట్ చేసిన తర్వాత షహీన్ తన ఖాతాలో రికార్డును వేసుకున్నాడు. 51 వన్డేల్లోనే షహీన్ షా అఫ్రిది వంద వికెట్లు తీసుకున్నాడు.
పాక్ బౌలర్లలో వన్డేల్లో వంద వికెట్లు తీసిన ఎలైట్ క్లబ్లో షహీన్ చోటు సంపాదించాడు. ఆ ప్రతిష్టాత్మక గ్రూపులో 21వ బౌలర్‌గా అతను తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో వసీం అక్రమ్ 502 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. 356 వన్డేల్లో అతను ఆ వికెట్లను తీశాడు.
2018లో జరిగిన ఆసియాకప్‌లో షహీన్ అఫ్రిది వన్డే అరంగేట్రం చేశాడు. అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో అతని కెరీర్ ప్రారంభమైంది. షహీన్ 27 టెస్టుల్లో 105 వికెట్లు, 52 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు.