అహ్మాదాబాద్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు అహ్మాదాబాద్‌లో హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. దాయాది పాకిస్థాన్‌తో ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) మీడియాతో మాట్లాడారు. గతంలో ఏం జరిగిందన్న అంశం ముఖ్యం కాదు అని, ప్రస్తుత పరిస్థితిని ఎంజాయ్ చేయాలని, ఇండియాతో మ్యాచ్‌లో రాణిస్తామన్న నమ్మకం ఉందని బాబర్ పేర్కొన్నాడు. ఇండియా, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఉత్కంఠత ఉంటుందన్నాడు. వేల సంఖ్యలో అభిమానులు వస్తుంటారని, అభిమానుల ముందు ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఒక ప్రణాళిక ప్రకారం భారత బౌలర్లను ఎదుర్కోనున్నట్లు బాబర్ ఆజమ్ తెలిపాడు.
తొలి 10 ఓవర్లలో వికెట్ భిన్నంగా ఉంటుందని, ఆ తర్వాత 10 ఓవర్లు భిన్నంగా ఉంటాయన్నాడు. దాని ప్రకారమే తమ ప్లాన్ ఉంటుందన్నాడు. భారత్‌తో మ్యాచ్‌కు మేటి బౌలర్ నసీమ్ షా దూరం అవుతున్నట్లు చెప్పాడు. షాహీన్ తమ ఉత్తమ బౌలర్ అని బాబర్ కితాబు ఇచ్చాడు. అతనిపై మాకు నమ్మకం ఉందని, అతనికి అతనిపై నమ్మకం కూడా ఉందన్నాడు. భారత్‌లో ఆడడంలో ఎటువంతి వత్తిడి లేదని, ఇరు జట్లు గతంలో చాలా సార్లు పోటీపడ్డాయని, హైదరాబాద్‌లో తమకు మంచి సపోర్టు వచ్చిందని, అహ్మాదాబాద్‌లో కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.