దుబాయ్ : పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది వన్డే బౌలర్లలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అఫ్రిది ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన అఫ్రిది వన్డేలలో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
అఫ్రిది 51 మ్యాచ్‌లలో ఈ మైలురాయి చేరుకుని అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన వారిలో మూడో స్థానంలో నిలిచాడు. కాగా భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ర్యాంకింగ్స్‌లో 3, 7 స్థానాలలో నిలిచారు. బ్యాటర్లలో బాబర్ అజమ్ టాప్‌లో కొనసాగుతుండగా, భారత బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2, 5, 7 స్థానాలలో నిలిచారు.