బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. ఆ మక్కువతోనే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అబుదాబి నైట్ రైడర్స్ జట్టును కూడా కొనుగోలు చేశాడు. ఇప్పుడు తాజాగా మహిళల క్రికెట్లో కూడా అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ హీరో.. ఒక మహిళా జట్టుకు కూడా యజమాని అయ్యాడు.
ఐపీఎల్ తర్వాత బాగా పాపులర్ అయిన టీ20 లీగుల్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఒకటి. ఇది బాగా సక్సెస్ అవడంతో మహిళలకు సీపీఎల్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఆగస్టు 30 నుంచి మహిళల సీపీఎల్ జరగనుంది. దీనిలో ఆడే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్) జట్టును షారుఖ్ కొనుగోలు చేశాడు.
వీళ్లు ఆడే తొలి మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. షారుఖ్ ఒక్కడే కాదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కూడా వుమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూసీపీఎల్)లో ఒక జట్టును కొనుగోలు చేసింది. దాని పేరు బార్బడోస్ రాయల్స్. దీంతోపాటు గుయానా అమెజాన్ వారియర్స్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటాయి.
This is such a happy moment for all of us at @KKRiders @ADKRiders & of course the lovely set of people at @TKRiders Hope I can make it there to see this live!! https://t.co/IC9Gr96h92
— Shah Rukh Khan (@iamsrk) June 17, 2022