INDW VS AUSW : భారీ ఛేదనలో భారత జట్టకు బిగ్ షాక్. వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ ఆతుడున్న షఫాలీ వర్మ(10) ఔటయ్యింది. రెండు బౌండరీలతో జోరు చూపించిన తను కిమ్ గార్త్ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో.. 13 పరుగుల వద్ద టీమిండియా తొలివికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన(4 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(1 నాటౌట్) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్లకు స్కోర్.. 16-1. ఇంకా టీమిండియాకు 324 రన్స్ కావాలి.
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించారు ఓపెనర్లు. మేగన్ షట్ వేసిన తొలి ఓవర్లో షఫాలీ వర్మ(10) ఒక బౌండరీ సాధించగా ఎనిమిది పరుగులు వచ్చాయి. అనంతరం కిమ్ గార్త్ బౌలింగ్లో కవర్స్ దిశగా ఫోర్ బాదిన షఫాలీ.. ఆ తర్వాత బంతిని అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయింది. అంతే.. 13 పరుగుల వద్ద తొలివికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(1 నాటౌట్)తో కలిసి స్మృతి మంధాన మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతోంది.
Not a fairytale comeback for Shafali Verma…#INDvAUS live ⏩ https://t.co/k3G9CxqjCR pic.twitter.com/UxQ8oA1ETX
— ESPNcricinfo (@ESPNcricinfo) October 30, 2025