BCCI : మహిళల టీ20 వరల్డ్ కప్ వైఫల్యం నుంచి తేరుకొని స్వదేశంలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత జట్టు (Team India) మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. దాంతో, ఈ పర్యటన కోసం మంగళవారం భారత సెలెక్టర్లు 16 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా కంగారూ దేశం వెళ్లనున్న బృందంలో షఫాలీ వర్మ(Shafali Varma) పేరు లేదు. పొట్టి వరల్డ్ కప్, ఆ పై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన లేడీ సెహ్వాగ్‌పై వేటు పడింది. కివీస్‌పై మూడు మ్యాచుల్లో షఫాలీ 59 రన్స్ చేసిందంతే. దాంతో, ఆమెను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాదు యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ సైతం బృందంలో చోటు దక్కించుకోలేకపోయింది. ఏడాది కాలంగా జట్టుకు దూరమైన సీనియర్ ఆల్‌రౌండర్ హర్లీన్ డియల్ మళ్లీ బ్లూ జెర్సీ వేసుకోనుంది.
A look at #TeamIndia‘s ODI squad for the upcoming tour of Australia 👌👌#AUSvIND pic.twitter.com/q0LRy53sSD
— BCCI Women (@BCCIWomen) November 19, 2024
డిసెంబర్ 5వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలు కానుంది. రెండో వన్డే డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ స్టేడియంలో జరుగనుంది. ఇక మూడో వన్డేను డిసెంబర్ 11న పెర్త్‌లోని వాకా మైదానంలో నిర్వహించనున్నారు.
భారత జట్టు స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రియా పూనియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మని, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, తితస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, సైమా థాకూర్.