అమరావతి : ఏపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది. తాజాగా విశాఖపట్నంలోని రెండవటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో న్యాయ విద్యార్థిపై (Law Student) రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ( Sexual assault ) ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె నగ్నఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులకు కోసం గాలించి పట్టుకున్నారు.
ఘటనపై ఫిర్యాదు అందగానే పోలీసులు గాలించి నలుగురిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని విశాఖ సీపీ(Visaka CP) శంకబ్రత బాగ్చీ(Shankabrata Bagchi) తెలిపారు. విద్యార్థినితో గత రెండు నెలలుగా ఒక యువకుడితో పరిచయం ఉందని వెల్లడించారు. అందరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు. యువతి, యువకులు అందరూ కూడా మేజర్ అని తెలిపారు.
నేరాలు అదుపు చేయడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ వివరించారు. ఈ ఘటనపై హోంమంత్రి విశాఖ సీపీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని,బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.